om-namo-venkatesaya-railer-talkవిలక్షణమైన పాత్రలు పోషిస్తూ విమర్శకులు, ప్రేక్షకుల చేత ‘జై జై’లు కొట్టించుకుంటున్న హీరో ఎవరైనా ఉన్నారంటే… ‘కింగ్’ నాగార్జున అని మాత్రమే చెప్పాలి. అలాంటి నాగ్, తాజాగా “ఓం నమో వేంకటేశాయ” వంటి భక్తిరస చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ధియేటిరికల్ ట్రైలర్ ను ఆడియో విడుదల సందర్భంగా రిలీజ్ చేసారు.

అంతకు ముందు విడుదల చేసిన టీజర్ లోని షాట్స్ నే చూపిస్తూ విడుదల చేసిన ట్రైలర్ లో ఎండింగ్ చాలా ఏమోషనల్ టచ్ ఇస్తూ రాఘవేంద్రరావు మార్క్ ను రుచిచూపించారు. అలాగే ట్రైలర్ ప్రారంభంలోనే సినిమా కధ గురించి క్లుప్తంగా చెప్పడంతో ప్రేక్షకులను మానసికంగా సిద్ధం చేసారు. యధావిధిగా ఈ ట్రైలర్ లో మొదట నాగార్జున మార్కులు కొట్టేయగా, ఆ తర్వాత క్రెడిట్ సంగీత దర్శకుడు కీరవాణి ఖాతాలో పడిపోయింది.

‘ఓం నమో వేంకటేశాయ’ అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వినపడుతున్న చాంటింగ్ అద్భుతంగా ఉండడమే కాదు, ఈ ట్రైలర్ ను ప్రేక్షకులు సరిగా రిసీవ్ చేసుకునే విధంగా మార్చేసింది. నాగ్ తో పాటు అనుష్క, ప్రజ్ఞా జైస్వాల్, జగపతిబాబు, రావు రమేష్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. సెంటిమెంట్ ను పండించడంలో రాఘవేంద్రుని మార్క్ ట్రీట్మెంట్ తో మరో హిట్ వీరిద్దరి అకౌంట్ లో పడేలాగానే కనపడుతోంది.