“ఆర్ఆర్ఆర్” సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించని నటీమణి ఒలీవియా, తాజాగా ఓ మీడియా సంస్థ అడిగిన పలు ప్రశ్నలకు జవాబిచ్చి ఆకట్టుకుంది. ‘ఆర్ఆర్ఆర్’తో తనకున్న అనుబంధాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్న ఒలీవియా, మీడియా ప్రతినిధి అడిగిన అన్ని ప్రశ్నలకు తడుముకోకుండా జవాబిచ్చింది.
“నాటు – నాటు” పాటలో అంతమంది డాన్సర్ల మధ్య డాన్స్ చేయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని., ప్యాలస్ లో చిత్రీకరించిన సీన్స్ అన్ని అద్భుతంగా వచ్చాయని తెలిపింది. మీ ఫేవరేట్ సీన్ ఏదో ప్రేక్షకులకు చెప్పాలని అడగగా “కొమరం భీం” సాంగ్ సీక్వెన్స్ మొత్తాన్ని, అందులో ఎన్టీఆర్ హావభావాలు తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాయని., తానూ కారు నడుపుతూ తిరిగే ఎపిసోడ్స్ ఎంజాయ్ చేసానని, రాజమౌళి విజన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ కొనియాడారు.
“ఆర్ఆర్ఆర్” సినిమాలో నటించడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని., సినిమాలో నటించేటప్పుడు తెలుగు కొంచెం నేర్చుకున్నానని., అయితే ఇప్పుడు పూర్తిగా మర్చిపోయానని అన్నారు. రోజులు గడిచే కొద్దీ సినిమా మీద ప్రేక్షకుడికి ఆసక్తి తగ్గకుండా జక్కన్నే ఈ జెన్నిఫర్ ను ప్రమోషన్స్ లో ‘ఆఖరి బంతి’లా వాడుతున్నారేమో అన్న సందేహం లేకపోలేదు.
సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన ఒలీవియా, సున్నితమైన మనసు కలిగిన బ్రిటిష్ యువతిగా చక్కగా కనిపించింది. ఒలీవియా అందచందాలకు, హావభావాలను తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. అయితే మరిన్ని తెలుగు సినిమాలలో ముద్దుగుమ్మ కనిపిస్తుందో లేదో మాత్రం చెప్పలేదు, బహుశా కాలమే సమాధానం చెప్పాలి.
TFI Supporters Of Jagan: Risked Careers, Got Cheated
Ratings: ABN Continues To Be Ahead Of Sakshi