Okkadu-Migiladu-Trailer-Talkతన చివరి చిత్రం ఇదేనంటూ ఓ ట్వీట్ చేసి “ఒక్కడు మిగిలాడు” సినిమాకు మంచి పబ్లిసిటీ తెచ్చుకున్న మంచు మనోజ్, తాజాగా ఆ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేసాడు. ఎల్టీటీఈ తీవ్రవాదిగా, కాలేజీ స్టూడెంట్ గా ద్విపాత్రాభినయం చేసిన మంచు మనోజ్, ఈ రెండు పాత్రలకు న్యాయం చేసేందుకు బాగా కష్టపడినట్లు ఈ ట్రైలర్ చెప్తోంది. సీరియస్ మోడ్ లో సాగిన ట్రైలర్, సినిమా ఉద్దేశం ఏంటో స్పష్టంగా ప్రేక్షకులకు చెప్పడంలో విజయవంతం అయ్యింది.

మొత్తంగా… లుక్స్ పరంగా మంచు మనోజ్ రెండు పాత్రలలో బాగానే ఉన్నప్పటికీ, ఎల్టీటీఈ పాత్రలో డబ్బింగ్ చెప్పిన విధానం పట్టి పట్టి చెప్పినట్లుగా వినపడుతోంది. పవర్ ఫుల్ గా వినిపించాలనే ప్రయత్నంలో ఇలా చెప్పారేమో గానీ, ఒకటి, రెండు చోట్ల కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయితే సబ్జెక్ట్ చాలా పెద్దది కావడంతో, మనోజ్ డబ్బింగ్ కంటే కూడా కధ పైకి ఆసక్తి మళ్ళుతుంది. ఎల్టీటీఈ కధను – కాలేజీ స్టూడెంట్ కధను ఎలా కలిపారు అన్నది చాలా కీలకమైన పాయింట్.

అందులోనూ సున్నితమైన ఇలాంటి కధలలో అటు వివాదాలకు తావు లేకుండా, ఇటు ప్రేక్షకులకు కావాల్సిన హీరోయిజాన్ని పండించాలంటే కత్తి మీద సాముతో కూడుకున్న పని. ఇందులో దర్శకుడు అజయ్ సఫలీకృతం అయితే మంచు మనోజ్ ఖాతాలో మంచి విజయం వేసుకోవచ్చేమో! శ్రీలంక ఎల్టీటీఈ నేత వేలుపిల్లై ప్రభాకరన్ జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై కాస్త ఆసక్తిని పెంచడంలో మాత్రం ఈ ట్రైలర్ సక్సెస్ అయినట్లే భావించవచ్చు.