okkadochadu-teaser-talkఒక్క హిట్టు కోసం విశాల్ పడుతున్న పాట్లు తెలియనివి కావు. అయితే ఈ సారి క్రేజీ కాంభినేషన్ ను సెట్ చేసుకుని “ఒక్కడొచ్చాడు” రూపంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా, జగపతిబాబులతో కలిసి వస్తున్న ఈ సినిమా తొలి టీజర్ విడుదలైంది. అయితే సినిమాల పేర్లు మారుస్తున్నారు గానీ, అవే యాక్షన్ దృశ్యాలు, అవే రివెంజ్ స్టోరీలను ఎంపిక చేసుకుంటున్నారన్న అనుభూతిని ఈ టీజర్ ఇచ్చింది.

‘తప్పు చేసిన వాడినైనా క్షమిస్తాను… కానీ చేసిన తప్పును సమర్ధించేవాడిని ఎప్పటికీ క్షమించను…’ అంటూ సాగే టీజర్ ను గమనిస్తే… విశాల్ ఈ సారి కూడా తప్పు చేస్తున్నాడేమో… అనిపించక మానదు. ‘పందెం కోడి’ నాటి యాక్షన్ దృశ్యాలకు తోడు, కర్ణకఠోరంగా వినిపించే బ్యాక్ గ్రౌండ్ సంగీతం టీజర్ ను మరింత భయానకంగా మార్చాయి. ఇక, చివరగా తమన్నా అందాలు ఏమైనా విశాల్ ను రక్షిస్తాయేమో చూడాలి.