Oke-Oka-Jeevitham-Telugu-Movie-Drawbacksఓ వ‌స్తువును త‌యారు చేయ‌టం ఎంత ముఖ్య‌మో దాన్ని మార్కెటింగ్ చేసుకోవ‌టం కూడా అంతే ముఖ్యం.దీన్ని సినీ ప్ర‌పంచానికి అన్వయిస్తే, సినిమాలను రూపొందించటమే కాదు.. వాటిని ప్రేక్ష‌కుల వ‌ద్ద‌కు తీసుకెళ్ల‌టం కూడా చాలా ముఖ్యం. ప్ర‌మోష‌న్స్ విష‌యంలో కేర్ తీసుకోక‌పోతే అది క‌లెక్ష‌న్స్‌పై ప్ర‌భావం చూపిస్తుంద‌న‌టంలో డౌటే లేదు. ఇప్పుడు అలాంటి జాబితాలో ‘ఒకే ఒక జీవితం’ సినిమా చేరింది. శ‌ర్వానంద్ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీకార్తీక్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించారు. సినిమా చ‌క్క‌గా వ‌చ్చింది.

దీంతో సినిమాకు తొలి ఆట త‌ర్వాత పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మూవీలు ఒక స్టైల్లో ఉంటే.. ఈ సినిమా పాయింట్ మ‌రోలా ఉంది. కాంప్లికేటెడ్‌గా సైన్సు గ‌ట్రా అని వివ‌రించేయ‌లేదు డైరక్ట‌ర్‌. సినిమాలోని మెయిన్ క్యారెక్ట‌ర్స్ ఫేస్ చేసిన త‌ప్పులు, మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌లను టైమ్ ట్రావెల్‌కు క‌నెక్ట్ చేస్తూ ఓ ఎమోష‌న‌ల్ కోణంలో సినిమాను తెర‌కెక్కించారు. ముఖ్యంగా మ‌ద‌ర్ సెంటిమెంట్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంది. దీంతో సినిమా బాగా లేద‌ని నెగిటివ్ టాక్ రాలేదు.

అయితే కంటెంట్ విష‌యంలో తెలివిగా ప్ర‌వ‌ర్తించినా డైరెక్ట‌ర్ టైటిల్ సెల‌క్ష‌న్ విషయంలో పొర‌ప‌డ్డాడ‌ని అనిపిస్తుంది. ఈ టైటిల్ విన‌గానే.. సాదా సీదా, నీర‌సంగా అనిపించ‌టంతో ఫ‌స్ట్ షోనే చూసేయాల‌నే ఆతృత జనాల్లో క‌ల‌గ‌లేదు. శ‌ర్వానంద్ గ‌త చిత్రాలన్నీ ఇదే త‌ర‌హా టైటిల్స్‌తో ప్లాప్ అవ‌టం కూడా ఈ సినిమాకు మైన‌స్ అయ్యింది. అలాగే సినిమాలోని మెయిన్ కంటెంట్‌ ఆడియెన్స్‌కు న‌చ్చుతుందో లేదో అనే డౌట్ మేక‌ర్స్‌కు వ‌చ్చి ఉంటుందేమో. అందుకే టైటిల్‌ను టైమ్ ట్రావెల్‌కు క‌నెక్ట్ చేసి పెట్ట‌లేక‌పోయార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

‘ఒకే ఒక జీవితం’ సినిమాను నిర్మాత‌లు ప్రీమియ‌ర్స్ ద్వారా ముందుగానే చూపించాల్సింది. మీడియాకో, త‌మ స‌న్నిహితుల‌కో సినిమా షోస్ వేసుంటే బావుండేది. దీని వల్ల రిలీజ్ టైమ్‌కు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యుండేది. సినిమా రిలీజ్ టైమ్‌కు పాజిటివ్ టాక్ తప్పకుండా వ‌సూళ్లపై ప్ర‌భావం చూపించేది. ఎలాంటి ప్రీమియ‌ర్స్ ప్లాన్ చేయ‌క‌పోవ‌టం.. నిర్మాతలకు న‌ష్టాన్నే క‌లిగించింది.

అలాాగే మేక‌ర్స్ ఓవ‌ర్ సీస్ విష‌యంలోనూ మరో త‌ప్పు చేశారు. మామూలుగా ఇండియా కంటే ముందుగానే యు.ఎస్‌లో ప్రీమియ‌ర్స్ షోస్ ప‌డ‌తాయి. సినిమా బావుంటే అక్క‌డ నుంచే పాజిటివ్ బ‌జ్ మొద‌ల‌వుతుంది. రివ్యూల రూపంలో వ‌చ్చే ఔట్‌పుట్ కూడా ఇక్కడ క‌లెక్ష‌న్స్ మీద ప్రభావం చూపిస్తుంద‌న‌టంలో సందేహ‌మే లేదు.

‘ఒకే ఒక జీవితం’ నిర్మాత‌లు యు.ఎస్‌లోనూ ప్రీమియ‌ర్స్ ఎర్లీగా వేయ‌లేదు. అదీగాక శ‌ర్వానంద్ గ‌త చిత్రాల‌న్నీ డిజాస్ట‌ర్స్ కావ‌టంతో ఓవ‌ర్‌సీస్ ప్రేక్ష‌కులు కూడా ఈ సినిమాపై పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. దీంతో ప్రీమియ‌ర్స్ రోజున సినిమాకు 20వేల డాల‌ర్స్ మాత్ర‌మే వ‌చ్చాయి. శ‌ర్వానంద్ వంటి ఓ ఇమేజ్ ఉన్న హీరో సినిమా ప్రీమియర్స్‌కి రావాల్సిన క‌లెక్ష‌న్స్ అయితే ఇవి కాద‌ని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. ఇక శుక్ర‌వారం రోజున వ‌చ్చిన పాజిటివ్ మౌత్ టాక్ వ‌ల్ల ల‌క్ష డాల‌ర్స్ మాత్ర‌మే వ‌చ్చాయి. మ‌రి శ‌ని, ఆది రావాల్లో సినిమా ఎంత పుంజుకుంటుందో చూడాలి.