6800 crores weddingపెళ్లంటే పచ్చని తోరణాలు… తప్పెట్లు… తాళాలు… వధూవరుల ఏడగులు… మూడు ముళ్లు… ఇవే..! కానీ, వీటిని ఏర్పాటు చేసే విధానం స్థాయిని బట్టి మారుతోంది. కజకిస్థాన్ లో పుట్టి రష్యా చమురు, మీడియా దిగ్గజంగా ఎదిగిన మిఖాయిల్ గుత్సరీవ్ తన కుమారుడి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

వివాహ వేడుకను మాస్కోలోని లగ్జరీ హోటల్ లోని సఫియా బాంక్వెట్ హాల్ లో ఏర్పాటు చేసి, పుష్పాలంకృత భారీ వేదికపై ‘నభూతో నభవిష్యతి’ అనే రీతిలో 28 ఏళ్ళ సయీద్ గుత్సరీవ్ 20 ఏళ్ళ ఖదీజా ఉజకోవ్ ను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి ఏకంగా 6,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట.

వధువు ధరించిన ఫ్రెంచ్ డిజైనర్ గౌనుకే దాదాపు 16.20 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని తెలుస్తోంది. ఆహూతులను అలరించేందుకు జెన్నిఫర్ లోపెజ్, హెన్రిక్ ఇంగ్లేషియస్ వంటి అంతర్జాతీయ పాప్ స్టార్స్ తో కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివాహ వేదికను పూలవనంలా తీర్చిదిద్దగా, మిఖాయిల్ గుత్సరీవ్ కు మొత్తం 38 వేల కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు సమాచారం.