Oh Baby Movie Box Office Records‘ఓ బేబీ’తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సమంత. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ బేబీ మొదటి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల షేర్ కలెక్టు చేసింది. సమంత కెరియర్‌లో సోలోగా అత్యధిక థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ ఆమె కెరియర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. దాదాపుగా 10 కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ సినిమా మొదటి వారం పూర్తి అయ్యే సరికి లాభాలలో ఉంటుంది. చాలా మంది పెద్ద హీరోలకు కూడా సాధ్యం కాని ఫీట్ ఇది.

ఈ చిత్రంలో సమంత 23 ఏళ్ల యువతిగా 70 ఏళ్ల బామ్మగా డిఫరెంట్ రోల్ ప్లే చేసి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టి ప్రేక్షకులతో శెభాష్ అనిపించుకుంది. ఇప్పటికే నటిగా తనను తాను నిరూపించుకున్న సమంత ఈ సినిమాతో తనలోకి కొత్త నటిని ‘బేబీ’ పాత్ర ద్వారా పరిచయం చేశారు. అలాగే ఈ విజయంతో సమంత టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించింది. గతంలో హీరోయిన్ల సినిమాలు అంటే ఏదో పీరియడ్ సినిమాలే. అనుష్క కొంతమేర అన్ని రకాల హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు ట్రై చేసినా పెద్దగా సక్సెస్ చూడలేదు.

ఓ బేబీ విజయంతో ఇప్పటివరకూ పెద్దగా మార్కెట్ లేని హీరోయిన్ సినిమాలు ఇక ముందు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సమంత కూడా పెళ్లి అయిపోయింది కాబట్టి రెగ్యులర్ సినిమాలు తగ్గించేసి ఇటువంటి సినిమాలలో నటించే అభిప్రాయంలో ఉన్నట్టు తెలుస్తుంది. పెళ్లి తరువాత సమంత యూ టర్న్ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. యూ టర్న్, ఓ బేబీ రెండు రీమేక్ సినిమాలు కావడం మరో విశేషం.