Officer-Movie-Reviewరాంగోపాల్ వర్మ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా విడుదలైన “ఆఫీసర్” సినిమా గత రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు సాగుతోంది. నాగ్ కెరీర్ లోనే అత్యంత దారుణమైన సినిమాగా ఫస్ట్ డే కలెక్షన్స్ (అర కోటి కంటే కూడా తక్కువగా) బయటకు వచ్చాయి. అంతేకాదు, టాలీవుడ్ లోనే భారీ డిజాస్టర్ జాబితాలో తొలిస్థానాన్ని ఆక్రమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టాలీవుడ్ ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు.

గతంలో బాలకృష్ణ – దాసరి కాంబోలో వచ్చిన “పరమవీరచక్ర’ మూవీ అగ్ర హీరోల సినిమాలలో భారీ డిజాస్టర్ గా నమోదు కాగా, వర్మ – నాగ్ ల ‘ఆఫీసర్’ దానిని పక్కకు నెట్టి నెంబర్ 1 స్థానం కైవసం చేసుకుంటుందని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. నాడు ‘శివ’తో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన ఈ కాంబో, నేడు ‘ఆఫీసర్’తో అలజడి రేకెత్తిస్తున్నారు. వర్మతో చేయాలన్న నాగ్ నిర్ణయంపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.