ntr-fansఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా అభిమానులతో మమేకమవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న “జనతా గ్యారేజ్” సినిమా సెట్స్ కు వచ్చిన అభిమానులందరితోనూ ‘బుడ్డోడు’ ఫోటోలకు ఫోజులు ఇస్తూ సందడి చేయడం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రతిరోజూ ఏదొక ఫోటోతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్, తాజాగా మరో ఫోటోతో ఆడియన్స్ ముందుకు వచ్చేసారు.

కారు దిగిన జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానులు ఘనస్వాగతం పలకడంతో… వారితో కలిసి సెల్ఫీ ఫోటోలు దిగారు ‘బుడ్డోడు.’ తమ అభిమాన హీరోనే ఏకంగా సెల్ఫీకు సిగ్నల్ ఇస్తే… ఫ్యాన్స్ కాంగా ఉంటారా… వాటిని సోషల్ మీడియాలో పెట్టి హంగామా సృష్టించేయరు… ప్రస్తుతం జరుగుతోంది కూడా అదే..! అందుకే ‘జనతా గ్యారేజ్’ సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం కూడా లభిస్తోంది..!