NT-Rama-Rao District2018లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర సమయంలో ఎన్టీ రామారావు పుట్టిన నిమ్మకూరులో నిలబడి తాను అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ పేరిట జిల్లా ఏర్పాటు చేస్తా అని ప్రకటించారు. నోటిఫికేషన్ ఇచ్చిన 26 జిల్లాల లిస్టులో ఎన్టీఆర్ జిల్లా కూడా ఒకటి.

అయితే ఏ పనైనా సరిగ్గా చేస్తే అది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అవుతుంది అని పలువురు ఆక్షేపిస్తున్నారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు ఉన్నది మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గంలో. కావున మచిలీపట్నంకు ఎన్టీఆర్ పేరు పెట్టడం సమంజసం.

అయితే అందుకు భిన్నంగా విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేశారు. ఎన్టీఆర్ సొంత ఊరులేని జిల్లా…. ఎన్టీఆర్ జిల్లా కావడం విశేషం. విజయవాడలో కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉంది కాబట్టి వారి ఓట్ల కోసం చేసిన పని ఇదని ఆరోపణ.

అయితే విజయవాడలో కూడా చాలా మంది ఈ నిర్ణయంతో ఆనందంగా లేరు. కొండ మీద ఉన్న అమ్మవారు, ప్రవహించే కృష్ణా నది విజయవాడకు తలమానికం. అటువంటి విజయవాడకు కృష్ణా అనే పేరు లేకుండా చెయ్యడం ఏంటి అని వారి వాదన.

“చిత్తశుద్ధి లేకుండా రాజకీయ లబ్ది కోసమే ప్రాకులాడుతూ చేసే పనులు ఇలానే ఉంటాయి,” అని పలువురి విమర్శ. ఇకపోతే తిరుపతి నియోకవర్గానికి శ్రీ బాలాజీ అని కాకుండా తెలుగు వారు పిలుచుకునే శ్రీ వెంకటేశ్వర జిల్లా అని పెట్టాలని పలువురి డిమాండ్.