ntr balakrishna cold warశనివారంనాడు నందమూరి ఫ్యామిలీలో రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి. రెండూ సినిమాలకు సంబంధించినవే అయినా ఎంతో ప్రాధాన్యతకు దక్కించుకున్నాయి. శనివారం మధ్యాహ్న సమయంలో “నాన్నకు ప్రేమతో” సినిమా కోసం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో అనుభూతులు పంచుకోగా, సాయంత్ర సమయంలో “డిక్టేటర్” ప్లాటినం డిస్క్ వేడుక జరిగింది.

“ఈ సంక్రాంతికి తన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో విడుదల కాబోతున్న బాబాయ్ ‘డిక్టేటర్’ సినిమా, ‘ఎక్స్ ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రాలు కూడా విజయవంతం కావాలని” జూనియర్ చెప్పారు. మరోవైపు “నాకు ఎవరూ పోటీ లేరంటూ” బాలయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారి సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. అయితే బాలయ్య ఆ విధంగా మాట్లాడేలా చేసింది “నాన్నకు ప్రేమతో” ఆడియో వేడుకేనని సినీ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇప్పుడు మీడియా ముఖంగా జూనియర్ చెప్పిన వ్యాఖ్యలే బహుశా “నాన్నకు ప్రేమతో” ఆడియో వేడుకపై చేసి ఉంటే, పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదన్న మాటలు సర్వత్రా వినపడుతున్నాయి. అప్పుడేమో కనీసం ‘బాబాయ్’ అన్న మాట కూడా వ్యాఖ్యానించకుండా, తన సినిమా విడుదల దగ్గరికి వచ్చేపాటికి ‘బాబాయ్’ సినిమా కూడా ఆడాలని చేసిన వ్యాఖ్యల పట్ల నందమూరి అభిమానులు కూడా కాస్త గుర్రుగా ఉన్నారు.

సున్నితమైన కుటుంబ విషయాలలో ఆలస్యం చేయడం వలన పరిస్థితులు చేయి దాటిపోతుంటాయి. ప్రస్తుతం బాలయ్య ఓ స్పష్టమైన ప్రకటన చేయడంతో నందమూరి అభిమాన వర్గం నుండి, తెలుగుదేశం పార్టీ వర్గాల నుండి “నాన్నకు ప్రేమతో” సినిమాకు ఏ మేరకు ఆదరణ లభిస్తుందనేది ప్రశ్నార్ధకంగా మారింది.