NTR, NTR Janatha Garage, NTR Singing Janatha Garage, NTR Sung Pakka Local Song Janatha Garage, Jr NTR Playback Singing Janatha Garageనాచురల్ స్టార్ నాని హీరోగా, ‘నేను… శైలజ…’ ఫేం కీర్తి సురేశ్ హీరోయిన్ గా ప్రారంభమైన సినిమాకు ‘నేను లోకల్’ అని టైటిల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. నాని ఇలా ‘లోకల్’ అని చెప్పాడో లేదో, తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ‘పక్కా లోకల్’ అంటూ వచ్చేయబోతున్నాడు. అది కూడా నాని కంటే ముందుగానే..! ఒక రకంగా ఈ రోజు ఆడియో పరంగా ప్రేక్షకులకు వినిపించడానికి ‘పక్కా లోకల్’ అంటూ రాబోతున్నాడు ‘యంగ్ టైగర్.’

కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ ల కాంభినేషన్లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్” సినిమాలో ‘పక్కా లోకల్’ అంటూ ఆలపించబోతున్నాడు జూనియర్. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఆడియో మరికొద్ది గంటల్లో విడుదల కానుండగా, ఈ ఆల్బం ట్రాక్ లిస్టు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మొత్తం 6 పాటలున్న ‘జనతా గ్యారేజ్’లో మూడవ పాట అయిన ‘ఆపిల్ బ్యూటీ’ ఇప్పటికే ఇంటర్నెట్ లో లీకై, అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. శిల్పకళావేదికలో జరగబోతున్న ఈ వేడుక కోసం ‘బుడ్డోడు’ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.