NTR-Puneeth Raj kumar-ss thamanసమయం గడుస్తున్న కొద్దీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన పెచ్చుమీరుతోంది. అయితే మరోవైపు ఎన్టీఆర్ మాత్రం స్టుడియోలో పాటలు పాడుతూ చక్కగా ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేసారు. ఎస్.ఎస్.తమన్ సంగీత నేతృత్వంలో కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ 25వ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ పాట పాడిన విషయం తెలిసిందే. ఇదంతా బుధవారం నాటి సాయంత్రపు సంగతులు.

ఈ నెల 27వ తేదీనే “నాన్నకు ప్రేమతో” చిత్ర ఆడియో విడుదల కావాల్సి ఉన్నా, చిత్ర యూనిట్ నుండి అధికారిక సమాచారం రాకపోవడంతో… జూనియర్ సినిమా వాయిదా పడుతుందని అభిమానులు ఆందోళన చెందారు. అయితే మరికొద్ది సేపటికే ఆడియో విడుదల తేదీ 27గా ఖరారు కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో భారీ స్థాయిలో ఆడియో వేడుక సిద్ధమవుతున్నట్లు సమాచారం.