ntr-on-hot-seat-of-meelokoteswarudu-nagarjuna“మీలో ఎవరు కోటీశ్వరుడు” కార్యక్రమంలో హాట్ సీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్షమవనున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రసారం కానున్న ఈ కార్యక్రమం ప్రోమో వీడియో విడుదల అయ్యింది. ఇద్దరు అగ్ర హీరోల మధ్య అభిమానులు వాతావరణం ఎలా ఉండాలని కోరుకుంటారో, సరిగ్గా అదే విధమైన రీతిలో ఇద్దరు హీరోలు దర్శనమిచ్చారు.

ఆహ్లాదకరంగా సాగిన ఈ వీడియోలో… “మా అబ్బాయి ఊహ వచ్చినప్పటి నుండి గడ్డంలోనే కనపడుతున్నా, నా ఒరిజినల్ గెటప్ ఎలా ఉంటుందో చూపించాలని ఇలా.., నాకు మీ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే భయమేస్తోంది.., ఎప్పటికైనా మనం ఈ గేమ్ ఆడాలి, కాకపోతే మీరు ఈ సీట్ లోకి రావాలి” అంటూ జూనియర్ చెప్పిన సంగతులు, “ప్రణిత ఇవ్వాలా చాలా చెప్పిస్తా… నువ్వలా చూస్తూ ఉండూ” అని కింగ్ చెప్పడం వీక్షకులను అలరిస్తోంది.