Nannaku Prematho climaxదర్శకుడిగా ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఎలాంటి కధను ఎంచుకున్నా, కొన్ని ఎలిమెంట్స్ ను మాత్రం ప్రతి దర్శకుడు వారి వారి సినిమాలలో ఫాలో అయిపోతుంటారు. అలా సుకుమార్ ప్రతి చిత్రంలో అనుసరించే అంశం ఒకటుంది. తన తొలి చిత్రం “ఆర్య” నుండి తాజా చిత్రం “నాన్నకు ప్రేమతో” వరకు దాదాపుగా ప్రతి సినిమా క్లైమాక్స్ లోనూ ‘సెంటిమెంట్’ సన్నివేశాలను పండిస్తాడు.

సాధారణంగా తెలుగు సినిమా క్లైమాక్స్ లో మాంచి ఊపున్న పోరాట సన్నివేశాలో, భారీ మాస్ డైలాగ్స్ గానీ దర్శకులు పెడుతుంటారు. అప్పటి లెజండరీ దర్శకుల నుండి ఇప్పటి రాజమౌళి వరకు దాదాపుగా అందరిదీ ఇదే ఫార్ములా. మరి తెలుగు సినిమా దశాదిశలను మార్చాలని నిర్ణయించుకున్నారో లేక తన సినీ మార్క్ ను చూపించాలనుకున్నారో గానీ… సుకుమార్ తన తొలి చిత్రం “ఆర్య” నుండి క్లైమాక్స్ సన్నివేశాలన్నీ బరువైన ఎమోషన్స్ తో నిండిపోతాయి.

ఈ ఒరవడి “1 నేనొక్కడినే” సినిమాతో పతాక స్థాయికి చేరుకున్నట్లుంది. మహేష్ వంటి స్టార్ హీరోను పెట్టుకుని చివరి 20 నిముషాలు సెంటిమెంట్ తో నింపేసిన సుకుమార్, తాజాగా ఎన్టీఆర్ చేత కూడా కంటతడి పెట్టించారు. అయితే సెంటిమెంట్, ఎమోషన్ సీన్లతో తెరకెక్కించినా, అవి వెండితెరపై పుష్కలంగా పండడంతో ప్రేక్షకులు కూడా సుకుమార్ మార్క్ “క్లైమాక్స్” సన్నివేశాలను ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికి సినిమాకు అవే ప్రధాన ఆకర్షణ అవుతున్నాయి.