NTR Mahanayakudu, Yatraఎన్ఠీఆర్ కధానాయకుడు కధ ముగిసింది. భారీ నష్టాలతో ఈ సినిమా తొలి భాగం బయ్యర్స్ కి చేదు అనుభవాన్నే మిగిల్చింది. అయితే ఎన్ఠీఆర్ మహానాయకుడు అయినా కనీసం బయ్యర్స్ ని ఆదుకుంటుంది అన్న ఆశతో ఉన్నాయి ట్రేడ్ వర్గాలు.

ఇదిలా ఉంటే నిన్న మొన్నటి వరకూ ఒక లెక్క, తాజాగా ఒక లెక్క అన్నట్లు ఎన్ఠీఆర్ మహానాయకుడు సినిమా వైఎస్సాఆర్ యాత్ర సినిమా రెండు ఒక్క రాజు వ్యవధిలో రిలీజ్ అవుతున్నాయి, అయితే ఈ బజ్ వల్ల ఎన్ఠీఆర్ సినిమా ఎలా ఉన్నా, యాత్రకి మాత్రం అటు ప్రేక్షకుల్లో , ఇటు ట్రేడ్ లో మంచి బజ్ ఏర్పడుతుంది అని అనుకున్నారు అందరూ..ఎందుకంటే రెండు పార్టీలకు చెందిన దివంగత మహానాయకులు సినిమాలు కావడంతో ఆ పోటీ మహద్య ట్రేడ్ ఈ బజ్ ఉంటుంది అని అనుకుంది.

కానీ తాజాగా వినిపిస్తున్న కధనం ప్రకారం ఎన్ఠీఆర్ మహానాయకుడు సినిమా కాస్త వాయిదా పడేలా ఉండడంతో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ వైఎస్సాఆర్ యాత్ర మీద ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పవచ్చు. పైగా ఇప్పటివరకూ యాత్ర సినిమాకు ఒక్క జగన్ మీడియాలో తప్ప, మిగిలిన మీడియా పెద్దగా బజ్ లేదు. ఈ లెక్కన ఎన్ఠీఆర్ సినిమాతో కలసి వస్తుంది అంటే, మంచి బజ్ ఏర్పడి సినిమాకి భారీ ఓపెనింగ్స్ అయినా దక్కుతాయి అని చెప్పవచ్చు.

కానీ మహానాయకుడు వాయిదా అన్న మాట ఇప్పుడు వైఎస్సాఆర్ ‘యాత్ర’ని ఇబ్బంది పెడుతుంది అని చెప్పవచ్చు. అయితే సినిమాలో కంటెంట్ ఉంటే ఆ సినిమాను ఎవ్వరూ అడ్డుకోలేరు అనుకోండి..మరి చూద్దాం యాత్ర ఎలాంటి అనుభూతులను మిగులుస్తుందో ఆ పార్టీకి, ఆయన అభిమానులకి.