NTR Mahanayakudu weak promotionsనిన్న విడుదలైన నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా ఘోరమైన ఓపెనింగ్ సాధించింది. మొదటి భాగం ఫెయిల్యూర్ తో ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు నిరాశపరుస్తున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో వరస్ట్ సినిమాల్లో ఒకటిగా పేరుగాంచిన ‘ఆఫీసర్’ కంటే కూడా ‘మహానాయకుడు’ ఫస్ట్ డే వసూళ్లు తక్కువగా నమోదయ్యాయి. చాలా ఏళ్ళ క్రితం వచ్చిన బాలయ్య ప్లాప్ చిత్రం పరమ వీర చక్ర కంటే ఈ సినిమా కలెక్షన్లు తక్కువ రావడం గమనార్హం.

కథానాయకుడు సినిమాకు ఫుల్‌రన్‌లో రూ. 50 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే మహానాయకుడుకు కూడా భారీ నష్టాలు తప్పవంటున్నారు విశ్లేషకులు. దీనితో బయ్యర్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఒకరకంగా ఈ సినిమా పై మొదటి నుండి నెగటివిటీ పెంచడంలో కొందరు సఫలీకృతం అయ్యరు అనే చెప్పుకోవాలి. ఇది తెలుగుదేశం పార్టీ రాజకీయ చిత్రంగా ప్రేక్షకులలోకి తీసుకుని వెళ్ళడంలో సక్సెస్ అయ్యారు. మొదటి సినిమా ప్లాప్ కావడంతో ఆ ప్రభావం కూడా గట్టిగా పడింది.

ఎన్టీఆర్ లాంటి మహనీయుడి జీవిత చరిత్ర ఆధారంగా తీసి ఆ మహనీయుడి కొడుకే నటించిన చిత్రానికి ఇటువంటి పరాభవం అనేది అవమానం అనే చెప్పుకోవాలి. అయితే కరుణుడి చావుకు సవా లక్ష కారణాలు అన్నట్టు ఈ చిత్ర పరాజయానికి వేరే కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో చిత్ర దర్శకుడు క్రిష్ ఫెయిల్యూర్ కూడా ఒక కీలక కారణం అని చెప్పుకోవాలి. ఇప్పుడు వివాదాస్పద ఎన్టీఆర్ చివరి రోజుల పై రామ్ గోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏమవుతుందో చూడాలి.