ntr-mahanayakudu-censor-reportనందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం కాసేపటి క్రితం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అనుకున్నట్టుగానే చిత్రానికి యూ సర్టిఫికెట్ వచ్చింది. ఇది కేవలం రెండు గంటల ఆరు నిముషాల నిడివి గల సినిమా అని తెలుస్తుంది. ఈనెల 22న చిత్రం విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం సంక్రాంతికి విడుదలయ్యి ఘోరమైన పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ఎక్కడా కూడా బ్యాడ్ టాక్ గానీ బ్యాడ్ రివ్యూలు గానీ రాలేదు. అయినా సినిమా ఆడలేదు.

అది ఎందుకో విశ్లేషకులకు కూడా అంతు పట్టలేదు. ఇప్పుడు మహానాయకుడు ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులతో పాటు ట్రేడ్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కథానాయకుడు మీద డబ్బులు పోగొట్టుకున్న వారికే రెండో భాగం రైట్స్ ఇచ్చి బాలయ్య తన ఓదార్యం చాటుకున్నారు. మొదటి భాగంలో 33% నష్టాలను తాను తీసుకోవడమే కాకుండా రెండో భాగం రెవిన్యూలలో వారికి 40% ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. దీనితో ఈ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నారు వారు.

ఎన్టీఆర్ మహానాయకుడులో అత్యంత కాంట్రవర్సియల్ అయినట్టు వంటి ఎన్టీఆర్ చివరి రోజులను పూర్తిగా పక్కన పెట్టేశారు. నాదెండ్ల భాస్కర రావు ఎన్టీఆర్ అమెరికాలో ఉన్న సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చెయ్యడం, ఆ తరువాత ఆయనను నిలువరించి ఎన్టీఆర్ ను తిరిగి అధికారంలోకి తీసుకుని రావడంతో కథ ముగుస్తుంది. ఈ కథ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం గుర్తు చేసుకుంటున్నట్టుగా మొదటి భాగంలో చూపించారు కాబట్టి ఆమె శివైక్యం కావడంతో కథ పూర్తి అవుతుంది.

ఎన్టీఆర్ – లక్ష్మి పార్వతి, చివరి రోజులు అన్నీ ఆవిడ లేని సమయంలో జరిగాయి కాబట్టి వాటి జోలికి వెళ్లారు. బాలయ్య వదిలేసిన వాటితోనే రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరుతో మరో సినిమా తీస్తున్నారు. ఇటు ఇటుగా అదే సమయానికి విడుదల చేసి బాలయ్య సినిమాని దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు రాము. మహానాయకుడికి ఆడియన్స్ ఏమని తలరాత రాస్తారో చూడాలి. తన తండ్రి జీవిత కథను ఆధారంగా తీస్తున్న ఈ సినిమా బయర్లకు కాసులు కురిపించాలని బాలయ్య కోరుకుంటున్నారు.