NTR- Kathanayakudu - public - talkపండగ సీజన్ కదా తెలుగు రాష్ట్రాలు రెండూ సినిమాలతో హడావిడని చేసేస్తూ ఉన్నాయి. అయితే అనుకున్నట్లుగానే ఈరోజు ఎన్ఠీఆర్ బయోపిక్ కథానాయకుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది…ప్రతీ ఛోటా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో ఎన్ఠీఆర్ గా బాలయ్య నటనకి జేజేలు పలుకుతున్నారు తెలుగు ప్రేక్షకులు.

ఇదిలా ఉంటే ఇప్పటివరకూ బాక్స్ ఆఫీస్ విషయంలో ఎన్ఠీఆర్ బయోపిక్, చెర్రీ వినయ విధేయ రామ పైనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ లెక్కల్లో ఎన్ఠీఆర్ హిట్ టాక్ తో గట్టెక్కేసాడు. కట్ చేస్తే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ కళ్ళు అన్నీ చెర్రీ వినయ విధేయ రామా పైనే ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇక ఇప్పటికే భారీ రేట్స్ కి కొన్న బయ్యర్స్ చెర్రీ సినిమా విషయంలో కాస్త టెన్షన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది.

దానికి గల కారణం కూడా మొదటి నుంచి సినిమాపై పెద్దగా బజ్ లేకపోవడమే. మరో పక్క ట్రైలర్, పాటలు ఉసూరు మనిపించడం కూడా ఈ సినిమాకి మైనస్ గా చెప్పవచ్చు. అయితే చెర్రీ సినిమా కాబట్టి ఓపెనింగ్స్ విషయంలో డోకా లేదు అనుకోండి…కానీ టాక్ ఏమాత్రం తేడా వచ్చినా కొన్న వారు నిండా మునిగిపోతారు అని చెప్పక తప్పదు. చూద్దాం మరి వినయ విధేయ రామ ఏం చెయ్యబోతున్నాడో.