NTR Kathanayakudu Posterగత కొన్ని రోజులుగా హల్చల్ చేస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ కు సంబంధించిన ఒక స్పష్టత వచ్చింది. ఇటీవల సందడి చేసిన విధంగానే ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి పార్ట్ లో స్వర్గీయ నందమూరి తారక రామారావు “కధానాయకుడు”గా కనిపించనున్నారు. ఈ సినిమాను జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఇక రెండవ పార్ట్ లో ఎన్టీఆర్ ను “ప్రజానాయకుడు”గా చూపిస్తూ తెరకెక్కిస్తున్నారు. ఈ రెండవ పార్ట్ ను జనవరి 25 గానీ, ఫిబ్రవరి 14న గానీ విడుదల చేయనున్నారు. క్రిష్ చేతికి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ రూపురేఖలన్నీ మారిపోయిన విషయం తెలిసిందే. విడుదల అవుతోన్న ప్రతి పోస్టర్ కూడా సినిమాపై అంచనాలను ఒక్కొక్కటిగా పెంచుకుంటూ పోతున్నాయి.