NTR Mahanayakuduనందమూరి బాల కృష్ణ…ఎన్ఠీఆర్ తనయుడిగా బాలయ్య చాలా పెద్ద సాహసమే చేసాడు. ‘ఎన్ఠీఆర్’ బయోపిక్ అనే సాహసానికి ఒడిగట్టాడు బాలయ్య..ఎన్ఠీఆర్ బయోపిక్ లో హీరోగా నటించడం ఒక లెక్క అయితే, మరో పక్కఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించాడు బాలయ్య.

అయితే మొదట ఈ సినిమా తియ్యాలి అని ప్లాన్ చేసినప్పుడు బాలయ్య ఈ సినిమాలో కేవలం హీరో మాత్రమే. కానీ ఆ తర్వాత తానూ కూడా నిర్మాతగా మారి చేస్తులు కాల్చుకున్నాడు బాలయ్య. అసలు నిర్మాతలు అయిన సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి ఇద్దరినీ సహా నిర్మాతలుగా చేర్చి, బాలయ్య ఈ సినిమా బాధ్యతని తన నెత్తిపై వేసుకున్నాడు.

కట్ చేస్తే బాలయ్య అన్ని రకాలుగానూ నష్టపోయాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా తొలి భాగం భారీ డిజాస్టర్ అయ్యింది. ఇక మాలి భాగాన్ని బాలయ్య ఫ్రీగానే ఇచ్చేస్తున్నాడు. అంటే ఈ లెక్కన నిర్మాతగా బాలయ్య ఈ సినిమాలో సంపాదించింది, వెనకేసుకుంది ఏమి లేదన్న మాట.

ఇక ఈ విషయం అలా ఉంటే, కనీసం ఆయన నిర్మాతగా మారకుండా ఉంటే ‘హీరో’ పారితోషకం అయినా మిగిలి ఉండేది బాలయ్యకి. అయితే తండ్రి చరిత్రను ప్రేక్షకులకు అందించే క్రమ్మలో బాలయ్య ఒక రకంగా పెద్ద త్యాగమే చేసాడు అని చెప్పవచ్చు.

ఏది ఏమైనా..ఎన్ఠీఆర్ మహా నాయకుడు అయినా మంచి హిట్ అయ్యి బాలయ్యకి ఈ టెన్సన్స్ తప్పిస్తుందేమో చూద్దాం.