Janatha Garage Trailer Talk, Janatha Garage Movie Trailer Talk, Jr NTR Janatha Garage Theatrical Trailer Talk, NTR Janatha Garage Trailer Talk రచయితగా ఉన్నపుడు కొరటాల శివ పేరు ఎంతమంది సినీ ప్రేక్షకులకు తెలుసు? అంటే వ్రేళ్ళ పైన లెక్క పెట్టుకోవచ్చు. కానీ, దర్శకుడిగా మారి ‘శ్రీమంతుడు’ సినిమా విడుదలైన తర్వాత కొరటాల శివ పేరు ఎంతమంది సినీ ప్రేక్షకులకు తెలియదు? అంటే… అప్పుడు కూడా వ్రేళ్ళ పైనే లెక్క పెట్టవచ్చు. అలాంటి కొరటాల శివ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తాజాగా దర్శకత్వం వహించిన “జనతా గ్యారేజ్” ధియేటిరికల్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కమర్షియల్ సినిమాలలో సామాజిక సందేశాలను మిళితం చేసి ప్రేక్షకులకు అందించే కొరటాల, తాజా సినిమాలో కూడా ‘చెట్ల పరిరక్షణ’ అనే కాన్సెప్ట్ ను హీరో చేత చెప్పించినట్లుగా ట్రైలర్లో స్పష్టం చేసేసాడు. అలాగే సినిమా కధ ఏంటో కూడా ప్రతి సామాన్య ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా ట్రైలర్ లో చూపించేసాడు. ఇది కొరటాల స్టైల్… అంతే..! కధ ముందే చెప్పి బ్లాక్ బస్టర్ కొట్టడం కొరటాలకు అలవాటైన విధానం. అందుకే అభిమానులు ఆశించిన అంచనాలను ఈ సినిమా ట్రైలర్ అందుకోలేకపోయినా… కధ పరంగా, హీరో పాత్ర పరంగా ఎలాంటి ట్విస్టులు ఇవ్వకుండా ప్రేక్షకులను మానసికంగా సిద్ధం చేసేసాడు.

ఎంతలా సిద్ధం చేసాడు అంటే… ఈ ట్రైలర్ లో నిత్యామీనన్ హీరో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ని ఉద్దేశిస్తూ ‘ఇంత బోరింగ్ క్యాండిడేట్ తో ఎలా అండి’ అని చెప్పేటంత వరకు! ‘శ్రీమంతుడు’ సినిమాలో హీరో పాత్ర గురించి ‘తానూ బోర్ కొట్టేస్తాను’ అని మహేష్ చెప్పించిన కొరటాల, ఈ సినిమాలో నిత్య చేత చెప్పించాడు. అయితే ట్రైలర్ లో ఉన్న స్పష్టత ఇప్పటివరకు నెలకొని ఉన్న అంచనాలను కాస్త తగ్గించి, కాన్సెప్ట్ పరంగా ఫిక్స్ చేసింది. ఇక, తిరు వంటి అత్యున్నత సాంకేతిక విభాగంతో నిండుకుని ఉండడంతో, ట్రైలర్ ఆద్యంతం విజువల్ గా అదిరిపోయింది. మొత్తమ్మీద ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.