janatha-garage-thanks-meetఅనూహ్యమైన కలెక్షన్స్ తో దూసుకుపోతున్న “జనతా గ్యారేజ్” చిత్ర యూనిట్ ఇటీవలే కేక్ కట్ చేసి ‘థాంక్స్ మీట్’ నిర్వహించి, అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే తాజాగా ‘గ్యారేజ్’ సభ్యులు మరో పార్టీకి సిద్ధమవుతున్నారు. అయితే ఈ సారి పేరు మారింది… ‘సక్సెస్ మీట్’ పేరుతో హైదరాబాద్, జూబ్లిహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ‘జనతా గ్యారేజ్ విజయోత్సవం’ వేడుకను నిర్వహించనున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు దాదాపు పన్నెండేళ్ళ తర్వాత ఒక బంపర్ హిట్ లభించడమే ఇన్ని పార్టీలకు కారణంగా చెప్పవచ్చు. ‘థాంక్స్ మీట్’లో అభిమానులెవరూ భాగస్వామ్యం కాకపోవడంతో, ఈ ‘సక్సెస్ మీట్’లో వారికి అవకాశం కల్పించారు. మంగళవారం నాడు సాయంత్రం అంగరంగ వైభవంగా ఈ వేడుకను జరుపుకునేందుకు ‘జనతా గ్యారేజ్’ బృందం సిద్ధమవుతోంది. చిత్ర యూనిట్ మొత్తం ఈ సక్సెస్ సంబరాలకు హాజరు కానున్నారు.