Janatha Garage Inside Talk, NTR Janatha Garage Inside Talk, Janatha Garage Movie Inside Talk, NTR Janatha Garage Movie Inside Talk, Janatha Garage Talkసెప్టెంబర్ 1వ తేదీన విడుదల కాబోతున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్”పై అభిమానులు చాలా అంచనాలనే పెట్టుకున్నారు. ‘ఇండస్ట్రీ హిట్’ అనే మాటను అందుకుని దాదాపు పుష్కర కాలం గడవడంతో… మరోసారి ఆ పదాన్ని అనాలని ఊవ్విళ్ళూరుతున్నారు. మరి అసలు ఇండస్ట్రీ వర్గాలలో ‘జనతా గ్యారేజ్’ ఏమనుకుంటున్నారు? సెన్సార్ పూర్తి కావడంతో, ఏదొక టాక్ సోషల్ మీడియా ద్వారా బయటకు వెలువడుతూ ఉంటున్న నేపధ్యంలో ‘జనతా గ్యారేజ్’పై టాక్ ఎలా ఉంది? అన్న అంశాన్ని పరిశీలిస్తే…

‘ఫస్టాఫ్ – యావరేజ్, సెకండాఫ్ – బ్లాక్ బస్టర్’ అంటోంది సోషల్ మీడియా. ‘జనతా గ్యారేజ్ ఇన్ సైడ్ టాక్’ అంటూ హల్చల్ చేస్తోన్న ఈ సమాచారం ఎంతవరకు వాస్తవమో, సినిమా విడుదలైతే గానీ తెలియదు. కానీ, ఇటీవల కాలంలో ప్రతి పెద్ద సినిమాకు ఇలా ‘ఇన్ సైడ్ టాక్’లు పేరుతో సోషల్ మీడియాలో హల్చల్ చేయడం, తీరా అవి ధియేటర్ల దగ్గరికి వచ్చేపాటికి పూర్తి స్థాయి నెగిటివ్ రిపోర్ట్ రావడం షరామామూలు అయిపోయింది.

‘సర్ధార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, కబాలి’ వంటి పెద్ద సినిమాలకు ఇలా ప్రీ రిలీజ్ టాక్, సెన్సార్ టాక్ ల పేరుతో ‘సినిమా అదిరిపోయింది’ అన్న సమాచారం హల్చల్ చేసిన వైనం తెలిసిందే. కానీ, బొమ్మ పడిన తర్వాత అంతా తారుమారు అయిన వైనం కూడా గమనించదగినదే. మరి ‘జనతా గ్యారేజ్’ విషయంలో ప్రస్తుతం వినపడుతున్న టాక్ లో ఎంతమేరకు వాస్తవం ఉందో సెప్టెంబర్ 1వ తేదీన తేలిపోనుంది.