NTR-jai lava kusa teaser on vinayaka chavithi‘జై’ పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చి యూ ట్యూబ్ రికార్డులన్నీ మటుమాయం చేసిన జూనియర్ ఎన్టీఆర్, ‘లవ’ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి సిద్ధమైపోయాడు. నెగటివ్ పాత్రలో అల్లాడించిన తారక్, ఈ పాజిటివ్ పాత్రతో ఎంత వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాడో అన్న ఆసక్తి అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలలోనూ నెలకొంది. మొదటి పాత్ర అంటే నెగటివ్ గా కొత్తగా ఉండడంతో, వారు వీరు అన్న తేడా లేకుండా ముక్తకంఠంతో ‘జై’కు జై కొట్టారు. మరి అంతే స్పందనను ‘లవ’ కూడా దక్కించుకుంటాడా..?

ఇది తెలియాలంటే గురువారం సాయంత్రం 5.40 నిముషాల వరకు వెయిట్ చేయాల్సిందే. వినాయకచవితి సందర్భంగా ఈ టీజర్ ను విడుదల చేస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే గతంలో ‘జై’ టీజర్ లీకేజ్ జరిగిన నేపధ్యంలో… ఈ సరికొత్త టీజర్ అలాంటి లీకేజ్ బారిన పడకుండా చిత్ర యూనిట్ పలు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ‘జై’ మాదిరి కాకుండా ‘లవ’ పాత్రను నేరుగా అఫిషియల్ టీజర్ ద్వారానే అవకాశం దక్కుతుంది.

ఇదిలా ఉంటే… ‘స్పైడర్’ మొదటి టీజర్లో ఏం చూపించకపోయినా మంచి స్పందనను తెచ్చుకోగా, రెండవ టీజర్ మాత్రం భారీ నెగటివ్ టాక్ ను కైవసం చేసుకుని అభిమానులను గందరగోళంలో పడేసింది. ‘స్పైడర్’ మాదిరే ‘జై లవకుశ’ మొదటి టీజర్ కు అనూహ్య స్పందన లభించింది. మరి రెండవ టీజర్ కూడా ‘స్పైడర్’నే అనుసరిస్తే, ‘యంగ్ టైగర్’ అభిమానులు నిరుత్సాహానికి గురికాక తప్పదు. అయితే ఇప్పటికే విడుదలైన ‘ఫస్ట్ లుక్’ పోస్టర్లో క్లాస్ గా అదిరిపోతున్నారు జూనియర్ ఎన్టీఆర్.