finally-jr-ntr-talks-about-his-balakrishna-gpskబాబాయ్ నందమూరి బాలకృష్ణ – అబ్బాయ్ జూనియర్ ల మధ్య సయోధ్య లేదు. ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో వేడుక నుండి ‘జనతా గ్యారేజ్’ సక్సెస్ వేడుకల వరకు ఒక్కసారి కూడా బాబాయ్ బాలయ్య బాబు పేరును ప్రస్తావించకపోవడంతో… ‘వార్’ కొనసాగుతోందన్న వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. అయితే ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ మౌనం వీడారు.

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన “గౌతమీపుత్ర శాతకర్ణి” ట్రైలర్ విడుదల సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ‘బుడ్డోడు’ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ట్రైలర్ అద్భుతంగా ఉందని, ఇంతకు ముందేపుడూ చూడని బాబాయ్ ఎన్.బి.కే.ను చూస్తున్నామని… ట్రైలర్ పై స్పందన తెలియజేయడంతో… నందమూరి అభిమానులకు డబుల్ బొనంజా తగిలినట్లయ్యింది.

మొత్తానికి క్రిష్ దర్శకత్వం వహించిన “గౌతమీపుత్ర శాతకర్ణి” ట్రైలర్ బాబాయ్ – అబ్బాయ్ లను కలిపిందన్న మాట. దీంతో మున్ముందు మరే విభేదాలు తలెత్తకుండా చూసుకుంటే… ఇక్కడితో ‘రణం’ ముగిసినట్లే భావించవచ్చు. ట్రైలర్ ద్వారా బాలయ్య బాబు విశ్వరూపం చూపుతుంటే… జూనియర్ స్పందనతో నందమూరి అభిమానుల్లో ఆ ఉత్సాహం రెట్టింపయ్యింది.