NTR-dubbing“నాన్నకు ప్రేమతో” సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. యంగ్ టైగర్ కూడా తన గొంతును సవరించి, డబ్బింగ్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చిత్ర యూనిట్ ఇప్పటికే డబ్బింగ్ పూర్తి చేయగా, శనివారం నాడు జూనియర్ ఆరంభించారు.

డబ్బింగ్ పూర్తి అయిన తర్వాత రీ రికార్డింగ్ తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ కు వెళ్ళడమే ఆలస్యం. ‘సంక్రాంతి’ విడుదలగా ఖరారు కావడంతో అభిమానులు కూడా పండగ హంగామాకు సిద్ధమవుతున్నవారు. ధియేటిరికల్ ట్రైలర్ ఇప్పటికే 2 మిలియన్ క్లిక్స్ దాటి సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

జూనియర్ తో పాటు జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ వంటి ఒకప్పటి హీరోలు కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. వీటన్నింటికి తోడు దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. ఇక, మిగిలిందల్లా… ధియేటర్లలో ‘బుడ్డోడు’ దండయాత్రే!