NTR-dialogueప్రజల్లో సినీ సెలబ్రిటీలకున్న ఇమేజ్ లను వ్యాపారస్తులు ఏ విధంగా వినియోగించుకుంటున్నారో అన్న దానికి నిదర్శనం ఈ పోస్టర్. సహజంగా టీ క్యాంటీన్లకు, సెలూన్ షాపులకు తమ తమ అభిమాన హీరోహీరోయిన్ల పేర్లు పెట్టుకోవడం అతి సహజం. అయితే ఆయుర్వేద మందులు అమ్ముకునే ఓ సంస్థ ప్రచారం చూస్తే… కాస్త హాస్యాస్పదంగా ఉండక మానదు.

“ఆది” సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పలికిన పాపులర్ డైలాగ్… ‘అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా…’ డైలాగ్ ను పోలి, ‘అమ్మ తోడు…’ అంటూ మరుగుదొడ్డిలో చేయాల్సిన మల విసర్జనపై ‘ఆచారి ఆయుర్వేద టీ పొడి – అన్ని కిరాణా షాపుల్లో లభిస్తుంది..’ అంటూ ప్రచారం చేస్తున్నారు. సదరు పబ్లిసిటీ చూసి జనాలు నవ్వుకుంటున్నా గానీ, ఒక సినిమా డైలాగ్ తో పెద్ద ప్రచారాన్నే ఆర్జిస్తున్నాడు.

తెలంగాణాలోని, మహబూబ్ నగర్ జిల్లా, అచ్చంపేటలో వెలిసిన ఈ పోస్టర్ ను కమెడియన్ వెన్నెల కిషోర్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. సినిమాల్లో తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించడమే కాదు, ట్విట్టర్లో పెట్టే పోస్టుల ద్వారా కూడా కిషోర్ నెటిజన్ల చేత నవ్వులు పూయిస్తున్నాడు.