Ntr-Daughter-Uma-Maheshwari-Final-Ritualsఓ కుటుంబంలో తీవ్ర విషాదం సంభవిస్తే పరిచయం లేనివారు కూడా ‘అయ్యో పాపం’ అని జాలిపడతారు. ఆ కుటుంబం మీద సానుభూతి చూపుతారు. కానీ తెలుగు ప్రజలు ఎంతగానో అభిమానించే నందమూరి తారకరామారావు కుమార్తె ఉమామహేశ్వరి చనిపోయినందుకు నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగి ఉండగా వైసీపీ నేతలు ఆమె మృతిని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లకు ముడిపెడుతూ సోషల్ మీడియాలో చాలా దారుణంగా కామెంట్స్ చేసారు. వాటి గురించి మళ్ళీ ఇక్కడ చెప్పుకోవడం సంస్కార హీనతే అవుతుంది.

ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్‌లో కంఠమనేని ఇంటి నుంచే ఆమె అంతిమయాత్ర ప్రారంభం అయ్యింది. చిన్నప్పుడు ఎత్తుకొని ఆడించిన ముద్దుల చెల్లెలు ఉమా మహేశ్వరిని ఈరోజు ఆమె సోదరులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ తదితరులు పాడెపై తీసుకొని వెళుతుంటే అది చూసి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.

మహాప్రస్థానంలో నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వేంకటేశ్వర రావు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ తదితరులు ఆమెకు కడసారి నివాళులు అర్పించిన తరువాత ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఆమె చితికి నిప్పు అంటించి దహన సంస్కారాలు పూర్తిచేశారు.

అక్కడ నందమూరి కుటుంబం ఉమా మహేశ్వరి మృతితో తీవ్ర మనోవేదనతో కుమిలిపోతుంటే, వైసీపీ నేతలు సోషల్ మీడియాలో శవరాజకీయాలు చేయడంపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, ఐ-టిడిపి వారికి అదే స్థాయిలో ఘాటుగా బుద్ది చెప్పే ప్రయత్నాలు చేశారు.

సిఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైతే దానిని దాచిపెట్టి విజయసాయి రెడ్డి ఆయన గుండెపోటు వచ్చి చనిపోయారంటూ చెపుతున్న వీడియోను అయ్యన్న పాత్రుడు ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, “కోడికత్తి నటన, గుండెపోటు డ్రామా, తల్లి (విజయమ్మ)ని తరిమేయడం, చెల్లి (వైఎస్ షర్మిల)ను దిక్కులేని బాణంలా వదిలేయడం, ఇవన్నీ జగన్ రెడ్డి ట్రేడ్ మార్క్ సాయిరెడ్డి. సీబీఐ ఎంక్వైరీ ఎక్కడి నుంచి మొదలుపెడదాం? కోడికత్తి డ్రామా నుండా లేక నీ అల్లుడు సారా కంపెనీల నుండా? ఎన్టీఆర్ కుమార్తెలను అవమానపరచడం పెద్ద ఘనతగా భావిస్తున్నావా విజయసాయి రెడ్డి? ముందు ఇంట్లో ఉన్న అమ్మని, చెల్లిని గౌరవించమని మీ జగన్ రెడ్డికి ట్వీట్లు పెట్టు,” అంటూ ఘాటుగా హితవు పలికారు.