NTR Biopic - YSR Biopic Yatraఎన్టీఆర్ బయో పిక్ అంటూ బాలయ్య, వైఎస్ఆర్ బయో పిక్ అంటూ మమ్ముట్టి ఇద్దరూ సంక్రాంతి బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే నిన్నటి వరకూ ఒకలెక్క నేటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా తెలంగాణా లో కేసీఆర్ ప్రభంజనం తర్వాత అక్కడ టీడీపీ పార్టీ కనుమరుగు అయ్యింది అనే చెప్పాలి. ఇక వైకాపా ఎలానూ లేదు కనుకనే ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీల బలాబలాలు ఈ సినిమాపై పడతాయి అని స్పష్టంగా చెప్పవచ్చు.

స్వతహాగా వైఎస్ఆర్ పార్టీ అక్కడ పోటీలో లేకపోయినా, వైఎస్ఆర్ అంటే ఆ వర్గానికి చాలా అభిమానమే ఉంది. ఇక ఎన్టీఆర్ విషయమే తీసుకుంటే పేద బడుగు వర్గాలు తమ అవసరార్ధం, సంధర్భార్ధం ఎందరినో అభిమానించినా ఎన్టీఆర్ ను మాత్రం నిత్యం కోలుస్తునే ఉంటారు. ఎందుకంటే ఆయన ఆ ప్రాంతంలో తీసుకు వచ్చిన మార్పులు, సంస్కరణలు అలాంటివి.

ఇక ఇక్కడ వైఎస్ఆర్ బయో పిక్ కి, ఎన్టీఆర్ బయో పిక్ కి ఎలాంటి ఆదరణ లభిస్తుంది అన్న క్రమంలో ఎన్టీఆర్ బయో పిక్ ను తెలుగు టాప్ హీరో బాలయ్య చేస్తున్న క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాలు మంచి ఓపెనింగ్స్ వస్తాయి అని చెప్పవచ్చు. ఇక వైఎస్ఆర్ బయో పిక్ లో మళయాళ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో కనిపిస్తున్న క్రమంలో ఆ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కాస్త ఆలోచించదగ్గ విషయమే. మొత్తంగా చూసుకుంటే మాత్రం రాజకీయ మార్పుల వల్ల ఈ సినిమాలకు వచ్చే నష్టం ఏమీ ఉండదు అని చెప్పవచ్చు.