NTR- Biopicబయోపిక్స్ అంటే సాధారణంగా ఒక వ్యక్తి జీవితం ఆధారంగా తీసేవి కనుక ఆ వ్యక్తి యొక్క బాల్యం మొదలు పెట్టి, ఆ వ్యక్తి గొప్పవాడు అయ్యేవరకు, విజేతగా నిలిచే వరకు ఉంటాయి. అయితే ఈ క్రమంలోనే ప్రజలకు జరిగిన విషయాలని సినిమాటిక్ గా చూపించే క్రమంలో కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నారు దర్శకులు.

మహానటి బయోపిక్ తీసుకుంటే ఆ సినిమా దాదాపుగా 2 : 45 నిమిషాల పాటు నిడివి కలిగి ఉంది. ఇక తాజగా ఎన్ఠీఆర్ సినిమానే తీసుకుంటే దాదాపుగా 2 :51 నిమిషాల నిడివి కలిగి ఉంది. అయితే కథా పరంగా బయోపిక్స్ ఇలానే ఉంటాయి అని మనం అనుకున్నప్పటికీ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మాత్రం ఈ సినిమాలు కాస్త సాగదీత ధోరణినే తలపిస్తాయి.

అయితే అలా అని పూర్తిగా విస్మరించి నిడివి తగ్గించలేము. ఇక్కడ ఒక అవకాశం ఉంది అదేంటి అంటే, విషయాన్నీ సాగదీత ధోరణిలో కాకుండా కాస్త కట్ షాట్ గా చెప్పగలిగితే, నిడివి దానంతట అదే తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గతాన్ని వివరించే క్రమంలో స్క్రీన్ ప్లే ని కాస్త కట్ షాట్ గా రాసుకోగలిగితే బయోపిస్ అంటే బాబోయ్ అనే వారు కూడా థియేటర్స్ కి వస్తారు.

ఏది ఏమైనా, మహానుభావుల జీవితాలను తెరపైన ఆవిష్కరిస్తున్న వారందరి ప్రయత్నాలను మనమందరం అభినందించాల్సిందే.