NTR-Biopic-Trailer-Launch-Audio-Launchతెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే అన్న నందమూరి తారక రామారావు గారి జీవిత, సినిమా, రాజకీయ చరిత్రను తెరపై ఆవిష్కరిస్తున్న సినిమా “ఎన్టీఆర్ బయో పిక్” ఈ సినిమాలో ఒక్కో పాట ఒక్కో మణి పూసలా ఉంటుంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే రెండు పాటలు ‘మహానాయకా’…’రాజర్షి’ పాటలు మంచి ప్రేక్షక ఆదరణ పొందుతున్నాయి.

ఇక ఈరోజే విడుదల అయిన రాజర్షి పాట అయితే రోమాలూ నిక్క పొడిచేలా ఉంది. కీరవాణి ప్రాణం పెట్టి ఈ పాటకు సంగీతం సమకూర్చినట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది. ఇక ఈ పాటకు సాహిత్యం కూడా నభూతో న భవిష్యత్ అన్నట్లుగా..తెలుగు పదాలు అన్నీ కలగలిపిన కమ్మని అక్షర క్షీర సాగరం లాగా ఉంది అని చెప్పవచ్చు.

ఇక మరో పక్క సినిమా వర్గాల సమాచారం ఈ సినిమా ట్రైలర్ ను మరో నాలుగు రోజుల్లో అదే డిసెంబర్ 16న హైదరాబాద్ లో జరపనున్నారు అని, అదే క్రమంలో డిసెంబర్ 21 న ఈ సినిమా ఆడియో వేడుకను ఎన్టీఆర్ జన్మ స్థలం అయిన నిమ్మకూరులో జరపనున్నట్లుగా వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరి అదే నిజం అయితే ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ తో, రెండు పాటలతో మంచి ఊపు మీద ఉన్న నందమూరి అభిమానులకు సంక్రాంతి నెల ముందే వస్తుంది అని ప్రత్యేకంగా చెప్పవచ్చు.