NTR-Biopic---Nithya-Menen-Perfect-Fit-But-Getting-Overdoneపోస్టర్లతో క్యారెక్టర్లను పరిచయం చేస్తోన్న “ఎన్టీఆర్” బయోపిక్ యూనిట్, తాజాగా సావిత్రి లుక్ లో నిత్యామీనన్ ను దించింది. బ్లాక్ అండ్ వైట్ లో నిత్యామీనన్ లుక్ నాటి సావిత్రిని తలపిస్తుండగా, ఇక ఎన్టీఆర్ పాత్రలో నందమూరి నటసింహం సరిగ్గా సరిపోయారు. నాడు రూపొందిన ‘బ్లాక్ అండ్ వైట్’ సినిమా తరహాలోనే ఈ పోస్టర్లు రిలీజ్ చేస్తుండడం ప్రధాన ప్లస్ పాయింట్.

‘గుండమ్మకథ’లోని ‘లేచింది నిద్రలేచింది మహిళా లోకం’ అన్న సూపర్ హిట్ సాంగ్ లోని ఈ స్టిల్ నందమూరి ఫ్యాన్స్ లో పండగ శోభను తీసుకువచ్చింది. సంక్రాంతికి విడుదల కానున్న మిగిలిన సినిమాల కంటే “ఎన్టీఆర్ బయోపిక్” పబ్లిసిటీ పరంగా ముందువరుసలో ఉంది. “కథానాయకుడు” పేరుతో రిలీజ్ కానున్న ఫస్ట్ పార్ట్ ను జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.