NTR-Biopic-Latest-Updates-Krish“ఎన్టీఆర్” బయోపిక్స్ నుండి ఇప్పటివరకు అనేక రకాల పోస్టర్లు విడుదలయ్యాయి. అవన్నీ కూడా అశేష ప్రేక్షక లోకాన్ని విశేషంగా అలరించాయి. దానికి ప్రధాన కారణం… ఈ ప్రాజెక్ట్ ను పట్టుకున్న దర్శకుడు క్రిష్. అవును…. ఈయన చేతికి “ఎన్టీఆర్” బయోపిక్ వచ్చిన తర్వాత ఈ సినిమా రూపురేఖలే మారిపోయాయి.

కేవలం పోస్టర్లతోనే సినిమాపై అంచనాలు పెరిగే విధంగా చేసిన ఘనత క్రిష్ కే దక్కుతుంది. అలాంటి క్రిష్ జన్మదినోత్సవం సందర్భంగా పలు మేకింగ్ ఫోటోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. “ఓ చరిత్రకు తెరతీస్తున్న శుభదినాన జరుపుకుంటున్న జన్మదినం…. యుగపురుషుడితో సాగుతున్న ఈ ప్రయాణం….” అంటూ బాలయ్య స్పీచ్ లిస్తున్న ఫోటోలను విడుదల చేసారు.

ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు ఇంత పర్ ఫెక్ట్ గా ఉన్నాయంటే, దీనివెనుక క్రిష్ ఎంత కృషి చేసి ఉంటారో ఈ పిక్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఎన్టీఆర్ హావభావాలను పోలిన విధంగా బాలయ్య చేత పలికిస్తున్న పిక్… అలాగే బాలయ్యతో చర్చిస్తున్న ఫోటోలు…. నిజంగా “ఎన్టీఆర్” బయోపిక్ క్రిష్ కెరీర్ లో మరో మైలురాయిలా నిలిచేలా కనపడుతోంది. ఈ సందర్భంగా ఈ విలక్షణ దర్శకుడికి జన్మదిన శుభాకాంక్షలు.