NTR Biopicట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్..మరియు నందమూరి నట సింహం బాల కృష్ణ ఇద్దరూ కలసి ప్రాణం పెట్టి మరీ తెరకెక్కిస్తున్న చిత్రం “ఎన్టీఆర్ బయోపిక్” అన్న విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో తెలీదు కానీ… సినిమా రిలీజ్ ముందు మాత్రం భీబత్సమైన హైప్ ని తెచ్చుకుంటుంది. సినిమాలో వరుసగా ఒక్కో పాత్రను విడుదల చేస్తూ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచిన దర్శకుడు క్రిష్, లేటెస్ట్ గా సినిమా ఫర్స్ట్ సాంగ్ తో ప్రేక్షకులకు మధురమైన అనుభూతినే అందించాడు.

‘కధానాయకా’ అంటూ సాగే ఆ సాంగ్ లో ఎన్టీఆర్ తెలుగు తెరపై ఆవిష్కరించిన ఎన్నో పాత్రలు పల్లవిలా మారాయి. అయితే ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బయోపీక్ లో రెండో భాగం అయిన ఎన్టీఆర్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కుతున్న మహా నాయకుడులోని తొలి పాట మరో కొన్ని గంటల్లో అంటే ఈ రోజు సాయంత్రం 4:21 నిమిషాలకు విడుదల కానుంది అని అధికారికంగా సమాచారం అందుస్తుంది. ఈ పాట ‘రాజర్షి’ అంటూ సాగనుంది అన్నట్లుగా తెలుస్తుంది.

ఇక ఈ పాట విడుదల కోసం ఎంపిక చేసిన పోస్టర్ లో ఎన్టీఆర్ పాత్రలో జీవిస్తున్న బాలయ్య తెలుగుదేశం పార్టీ జెండాని రూపు దిద్దుతున్నట్లుగా కనిపిస్తున్న దృశ్యం చూస్తూ ఉంటే, ఈ పాటలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపన కోసం చేసిన కృషి, ఆ రోజుల్లో ఆయన పడ్డ కష్టం, నిర్ణయాలు, ఇక ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఎలా ఉన్నారు, ఎలా పాలన కొనసాగించారో అన్నీ ఈ పాటలో కూర్చి ఉంటారేమో అన్న ఆలోచన కలుగుతుంది. చూద్దాం మరి 35 క్రితం మొదలైన ఆ మహానాయకుడి రాజకీయ ప్రస్థానం తెరపై ఎలా ఆవిష్కృతం అవుతుందో. ఈ పాట పల్లవిలో ఎలా ఒదిగిపోయిందో.