NTR - Biopic -Kathanayakudu failed at box officeసినిమా బావుంది…ఎన్ఠీఆర్ ను బ్రహ్మాండంగా చూపించారు..హిట్ టాక్ కూడా వచ్చింది…కానీ కట్ చేస్తే ట్రేడ్ ఊహలు అన్నీ ఉహలకే పరిమితం అయ్యాయి. దానికి తోడు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పక్కనే పెట్టి రెండో భాగం షూటింగ్ లో బిజీ. ఇక సినిమా కొన్న బయ్యర్స్ నిరాశలో కూరుకుపోయారు. అసలు ఏం జరుగుతుంది ఎన్ఠీఆర్ చుట్టూ…ఎన్ఠీఆర్ అంటే తెలుగు ప్రేక్షకులకు మొహం మొత్తేశాడా? లేక ఎన్ఠీఆర్ సినిమాను బాలకృష్ణ చెయ్యడం వాళ్ళ సినిమా అలాంటి ఫలితం చవి చూసిందా?

ఏమాత్రం స్టార్ డమ్ లేని నాగ్ అశ్విన్, అందాల భామ కీర్తి సురేష్ తో కలసి తెరకెక్కించిన మహానటి…కి వచ్చిన క్రేజ్ ఎన్ఠీఆర్ కి ఎందుకు మిస్ అయ్యింది? ఇలా చాలా ప్రశ్నలు సగటు ఎన్ఠీఆర్ అభిమానిని…ట్రేడ్ పండితులను వేధిస్తున్నాయి. బహుశా ఎన్ఠీఆర్ సినిమాకి రాజకీయ జోక్యం ఎక్కువవ్వడం వల్లనో ఏమో ఈ సినిమాని ప్రేక్షకులు పెద్దగా చూడడంలేదు. అసలు సినిమాలో నిజాలు తియ్యలేదు అన్న వాదన కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. ఇంకా పచ్చిగా మాట్లాడుకుంటే కులం కోణం ఒకటి యాడ్ చేసి విషాన్ని చిమ్ముతున్నాయి కొన్ని గ్రూపులు.

అన్నీ వెరసి, సినిమాను కొన్న బయ్యర్స్ కి నష్టాన్నే మిగిల్చాయి. ఏది ఏమైనా…’ఎన్ఠీఆర్’ బొమ్మ హిట్ టాక్ తో కూడిన ఫ్లాప్ సినిమా అని చెప్పవచ్చు. మరి రెండో భాగం అయినా మంచి ఫలితాన్ని అందుకుంటుందేమో చూడాలి.