NTR -Biopic - Kathanayakuduఎన్ఠీఆర్ బయో పిక్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో వరుసగా ఈ సినిమా ప్రోమోస్ ని విడుదల చేస్తుంది ఈ సినిమా యూనిట్. ఒక్కో పాత్రను కలసి ఉన్న ఒక్కో సీన్ ను ప్రోమోస్ రూపంలో చూపిస్తుంది.

అయితే తాజాగా అక్కినేనితో ఎన్ఠీఆర్ సంభాషణ..తెలుగు గురించి అన్నగారి రూపంలో బాలయ్య మాట్లాడిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకూ అందరూ ఎన్ఠీఆర్ సినిమా రంగం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఎలా జరిగింది? అన్న కోణంలోనే ఈ సినిమాను చూపిస్తారేమో అన్న అనుమానం కలిగింది.

కానీ ఈ ప్రోమో ప్రకారం చూస్తే ఎన్ఠీఆర్ సినిమా ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వడం…కథా నాయకుడుగా ఎదగడమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ మదరాసు నుంచి హైదరాబాద్ కి తీసుకు వచ్చే క్రమంలో జరిగిన విషయం మొత్తం మొదటి భాగంలో ఉండబోతుంది అని తెలుస్తుంది..

ఆ రోజుల్లో అసలు మన పరిశ్రమ హైదరాబాద్ కి ఎలా వచ్చిందో తెలుసుకునే అవకాశం ఆ తరం నుంచి ఈ తరం వరకూ దొరుకుతుంది అని చెప్పవచ్చు..ఇక ఈ సందర్భాన్ని క్రిష్ తనదయిన శైలిలో తెరకెక్కించాడు అని అనుకోవచ్చు.