NTR Biopic- Balakrishna as NTR - Rana Daggubati as Chandrababu Naiduఈ పోస్టర్ చూసిన తర్వాత… ఈ ఫోటోలో ఉన్నది స్వర్గీయ నందమూరి తారక రామారావా? లేక ఆ పాత్రను ధరించిన బాలకృష్ణనా? అన్న భావన కలుగక మానదు. ఒక్క క్షణం రానా ముందు ఎన్టీఆర్ ఎలా ప్రత్యక్షం అయ్యాడు? అన్న అనుమానం కలిగిన తర్వాత… తీక్షణంగా చూస్తే అందులో ఉన్నది నందమూరి నటసింహం బాలకృష్ణ అన్న విషయం తేటతెల్లమవుతుంది.

ఈ ప్రాజెక్ట్ లోకి క్రిష్ వచ్చిన తర్వాత ఏర్పడిన పరిణామాలు “ఎన్టీఆర్”పై అంచనాలు భారీగా పెంచేస్తున్నాయి. ఇటీవలే చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన రానా పోస్టర్ వీక్షకుల మన్ననలు పొందగా, తాజాగా ఎన్టీఆర్ – చంద్రబాబు పాత్రలను ఒకే పోస్టర్ లో చూపించి, అభిమానులకు కన్నులవిందు చేసారు. ఈ మేకోవర్, గెటప్ లతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.