NRI Voting bill awaiting in Rajya Sabhaప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్‌.. అంటే ప్రతినిధి ద్వారా ఓటు వేయడం) సదుపాయం కల్పించేందుకు ఉద్దేశించిన ప్రజా ప్రాతినిధ్య (సవరణ) బిల్లు–2017ను లోక్‌సభ గత వారం ఆమోదించింది. ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్ట సవరణ అమలులోకి వస్తుంది.

కొత్త బిల్లు ఆమోదం పొందితే ఎంతో మంది ప్రవాస భారతీయులకు మన దేశంలో నిర్వహించే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సుమారు కోటీ 50 లక్షల మంది ఎన్నారైలు భారత ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుంది. వీరు అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇప్పటికే ఎన్నారైల ఓటింగు హక్కుకు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఇది 2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి అమలు లోకి వస్తుందా అనేది చూడాలి. ఎన్నికల లోగా ఈ బిల్లు అమలు లోకి వచ్చిన తక్కువ వ్యవధిలో ఎన్నికల సంఘం ఈ అవకాశం కలిపించగలుగుతుందా అనేది చూడాలి.