notes-exchange-ban-narendra-modiఆశించిన విధంగానే కేంద్రం నుండి పెద్ద నోట్ల మార్పిడి రద్దు నిర్ణయం వెలువడింది. అయితే ఇది తాత్కాలికంగా మాత్రమే. ఈ శనివారం నాడు పెద్ద నోట్ల మార్పిడిని రద్దు చేస్తూ ప్రకటన జారీ చేసింది. అయితే ఇందులో పెట్టిన చిన్న మెలిక ఏమిటంటే… దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్లకు అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం చేసారు.

నోట్ల మార్పిడి కోసం బారులు తీరిన క్యూ లైన్లలో నిల్చుని సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలు గత కొద్ది రోజులుగా నమోదు కావడంతో, శనివారం నాడు పూర్తిగా సీనియర్ సిటిజన్లకు అవకాశం కల్పించారు. శనివారం నాడు బ్యాంకులు పని చేసే సాధారణ వేళలలో మాత్రమే నోట్ల మార్పిడి చేయనున్నారు. గత పది రోజులుగా నిర్విరామంగా బ్యాంకు అధికారులు పని చేస్తుండడంతో ఈ వీకెండ్ కొంత ఉపశమనం ఇవ్వనుంది.

అయితే వరుసగా రెండు రోజులు సామాన్య ప్రజలకు నోట్ల మార్పిడికి అవకాశం లేకపోవడంతో, సోమవారం నాడు మళ్ళీ బారులు తీరిన క్యూలు దర్శనమివ్వడం ఖాయమని బ్యాంకు అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో పోలిస్తే… చేతిపై సిరా మార్క్ వేసిన నాటి నుండి ప్రజల రద్దీ కాస్త తగ్గడం గమనించదగ్గ విషయం.