nota-trailer-vijay-deverakondaసెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ చేస్తోన్న “నోటా” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైంది. స్టార్ హీరోగా గుర్తింపు రావడంతో, ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తోన్న సినిమాలపై అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు ప్రేక్షకులలో అత్యంత ఆసక్తి నెలకొంది. మరి ఆ అంచనాలను ‘నోటా’ ట్రైలర్ అధిగమించిందా? అంటే ఇందులో విజయ్ మార్క్ లోపించిందని చెప్పాలి.

ముఖ్యంగా ఈ ఏడాది విడుదలైన కొరటాల – మహేష్ బాబుల “భరత్ అనే నేను” సినిమా ఛాయలు కొన్ని ఉండడం అంచనాలు వేసిందే. ముఖ్యంగా ‘నాకస్సలు ఐడియా లేదు, ఎక్స్ పీరియన్స్ లేదు’ అన్న డైలాగ్ లోనూ, విజయ్ దేవరకొండ కుర్చీలో కూర్చున్న షాట్… మన పార్టీ వాళ్ళను మనమే అరెస్ట్ చేసుకుంటామా… అన్న డైలాగ్ వచ్చిన సందర్భంలో ‘భరత్ అనే నేను’ జ్ఞప్తికి రాకుండా ఉండదు.

అయితే దీనికి కాస్త తమిళ వాసన జోడించినట్లుగా కనపడుతోంది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ మార్క్ వినోదం ఈ ట్రైలర్ లోనే కాదు, సినిమాలో కూడా కనిపించదన్న సంగతిని ఈ “నోటా” కధ స్పష్టం చేస్తోంది. బహుశా సిల్వర్ స్క్రీన్ పైనే మరింత స్పష్టత వస్తుందేమో!