NOTA movie Public Talk‘పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం’ సినిమాలతో భారీ సక్సెస్ లు చవిచూసిన విజయ్ దేవరకొండ, తొలిసారిగా ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి, “నోటా” సినిమాకు పార్టనర్ గా కొనసాగాడు. చివరివరకు సుస్పెన్సుగా ఉంచిన ఈ విషయాన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయటపెట్టాడు విజయ్ దేవరకొండ.

తన సినిమా ప్రొడక్షన్ సింబల్ పడిపోగానే విజిల్స్ తో స్వాగతం పలకాలని కోరగా, “నోటా”కు వస్తోన్న స్పందన విజయ్ ను ఖంగుతినిపించేలా ఉంది. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతంగా జ్ఞానవేల్ రాజా విడుదల చేసుకున్నారన్న వార్తలు మరింత ప్రాధాన్యతను దక్కించుకున్నాయి.

ప్రొడక్షన్ లో ఎలా అయితే భాగస్వామి అయ్యారో, ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ లోనూ భాగస్వామి అయ్యే అవకాశాలు ఉంటాయి గనుక, ఫైనల్ గా ఈ సినిమా లాభాలను అందిస్తుందో లేదో అన్న ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో నెలకొంది. తొలిరోజు వెలువడిన టాక్ ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవడం విజయ్ కు షాక్ కు గురిచేసే విషయమే.