nota-dissappoints-vijay-deverakondaభారీ అంచనాల నడుమ బాక్సాఫీస్ ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ “నోటా” సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరుత్సాహపరిచిందన్న టాక్ ను సొంతం చేసుకుంది. నటుడిగా విజయ్ మరో మెట్టు ఎక్కినప్పటికీ, కమర్షియల్ గా వర్కౌట్ కాని సినిమాగా సినీ విశ్లేషకులు డిక్లేర్ చేసారు. ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ బట్టి, లాభనష్టాలపై బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.

ఏపీ, తెలంగాణాలతో పాటు విజయ్ గత రెండు సినిమాలు ‘గీత గోవిందం, అర్జున్ రెడ్డి’లు యుఎస్ లో భారీ కలెక్షన్స్ ను రాబట్టగా, ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. కానీ ప్రీమియర్స్ లెక్కల ప్రకారం ‘అర్జున్ రెడ్డి’ని కూడా దాటలేకపోవడం విశేషం. ‘అర్జున్ రెడ్డి’ ప్రీమియర్ షోలకు 194కే డాలర్స్ వసూలు కాగా, ‘నోటా’ కేవలం 189కే డాలర్స్ ను మాత్రమే సొంతం చేసుకుంది.

ఈ ఏడాది విడుదలైన ‘గీత గోవిందం’ 400కే డాలర్స్ కు పైగా ప్రీమియర్స్ ను సొంతం చేసుకుని విజయ్ కెరీర్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఓవరాల్ గా చెప్పాలంటే… ఈ ఏడాది ‘గీత గోవిందం’ సినిమా ద్వారా ప్రేక్షకులను ఎంతగా సంతృప్తి పరిచాడో, ఈ “నోటా” ద్వారా అంతగా నిరుత్సాహానికి విజయ్ దేవరకొండ గురి చేస్తున్నాడు.