not-only-pawan-kalyan-even-salman-khan-in-same-trouble-rockline-venkatesh“అత్తారింటికి దారేది” సినిమాకు తన పారితోషికం ఇవ్వలేదంటూ పవన్ కళ్యాణ్ గురించి టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఓ విషయం సందడి చేస్తుండగా, మరో వైపు బాలీవుడ్ మీడియా కూడా కోడై కూస్తోంది. గత ఏడాది విడుదలైన ప్రముఖ బాలీవుడ్ హీరోలలో సల్మాన్ ఖాన్ దే ఆధిపత్యం. అయితే పారితోషికం విషయంలో సల్మాన్ కు కూడా అన్యాయం జరిగిందని సమాచారం.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ నటించిన ‘భజరంగీ భాయీజాన్’ చిత్రం ఇండియాలో 300 కోట్లు, విదేశాల్లో 300 కోట్లు వసూలు చేసి కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే, ఈ చిత్రానికి సంబంధించి హీరో సల్మాన్ కు ముట్టజెప్పాల్సిన కొంత సొమ్ము ఇంకా అందలేదట. దీంతో కండల వీరుడు అసంతృప్తిగా ఉన్నాడని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకే రోజు టాలీవుడ్, బాలీవుడ్ లలో వెలుగు చూసిన ఈ సంఘటనలు మీడియా వర్గాలలో ప్రముఖంగా ప్రచారమవుతున్నాయి.