non bailable warrant-against-sanjay-duttఈ మధ్యే జైలు నుంచి విడుదలై… ప్రస్తుతం సినిమాల్లో నటించడం ప్రారంభించిన బాలీవుడ్ హీరో, ‘ఖల్ నాయక్’ సంజయ్ దత్ కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బాలీవుడ్ దర్శక, నిర్మాత షకీల్‌ నూర్‌ అనీ‌ను బెదిరించిన కేసులో సంజయ్‌ దత్ కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయినట్లుగా తెలుస్తోంది. ఓ సినిమా విషయంలో షకీల్‌ నూర్‌ – సంజయ్‌ దత్‌ మధ్య వివాదం నెలకొనగా, అది కాస్త ముదిరి పాకాన పడడంతో, చివరికి అది కోర్టు వరకు వెళ్ళింది.

షకీల్ నూరానీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు సంజయ్ దత్ అంగీకరించగా, దీనికి 50 లక్షల రెమ్యూనరేషన్ గా ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం రెండు రోజుల షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. ఆ తర్వాత తన రెమ్యూనరేషన్ కోటి రూపాయలు ఇస్తేనే నటిస్తానని, లేకపోతే నటించనని తెగేసి చెప్పాడు. దీంతో డబ్బులు తీసుకుని సంజయ్ దత్ మోసం చేశాడంటూ, షకీల్ నూరానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, న్యాయస్థానం సంజయ్‌ దత్‌ కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.