మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఓదార్పు!ఓ పక్కన టాలీవుడ్ అగ్ర హీరోల అభిమానులంతా తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ తో సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తుంటే, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మాత్రం “సర్కార్ వారి పాట” సంగతుల కోసం నిరీక్షిస్తున్నారు.

నందమూరి ఫ్యాన్స్ కు ‘అఖండ,’ అల్లు అభిమానులకు ‘పుష్ప,’ నందమూరి – మెగా మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్,’ యంగ్ రెబల్ స్టార్ అండ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు “రాధే శ్యామ్,” చిరు అభిమానులకు ‘ఆచార్య,’ అక్కినేని వారి కోసం ‘బంగార్రాజు,’ విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ కు ఇప్పటికే ‘దృశ్యం 2’… ఇలా అగ్ర హీరోల అభిమానులంతా ఒక్కసారిగా సందడి చేస్తుండడంతో టాలీవుడ్ కళకళలాడుతోంది.

Also Read – భువనేశ్వరికి బాలయ్య దీవెనలు… అన్నయ్యకి షర్మిల శాపాలు

మరి ఒక్క సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే ఎలాంటి అప్ డేట్స్ లేక విలవిలలాడుతున్నారు. ‘కనీసం ఒక్క పాటనైనా రిలీజ్ చేయండి మహాప్రభో’ అంటూ కొన్నాళ్లుగా సోషల్ మీడియా ద్వారా ఎంతగానో వేడుకుంటున్నారు గానీ, ప్రయోజనం శూన్యం. ఇలాంటి సమయంలో సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన సమాచారం ప్రిన్స్ ఫ్యాన్స్ కు ఓదార్పులా మారింది.

జనవరి నుండి ప్రతి నెల ‘సర్కార్ వారి పాట’ సినిమా నుండి ఓ సాంగ్ రిలీజ్ అవుతుందని చెప్పిన థమన్, ఈ సినిమా ప్రత్యేకమైనదిగా కొనియాడారు. సినిమా చాలా బాగా వస్తోందని థమన్ చెప్పిన మాటలే మహేష్ బాబు అభిమానులకు ఊరటనిస్తున్నాయి. దీంతో సంక్రాంతి నుండి సందడి చేయడానికి సమాయత్తమవుతున్నారు ఘట్టమనేని అభిమానులు.

Also Read – చంద్రబాబు నాయుడు అనే నేను….