No theaters for rajinikanth petta movieప్రతీ నిర్మాత…డిస్ట్రిబ్యూటర్ తన సినిమాని మంచి పండగ సీజన్ లో రిలీజ్ చేసుకుని పెట్టుబడికి రెండింతలు లాభాలు తెచ్చుకోవాలి అనే చూస్తాడు. అయితే రిలీజ్ డేట్ కి పోటీ గట్టిగా ఉంటేనే అసలు చిక్కు వచ్చి పడుతుంది. ఇప్పుడు రజనీకాంత్ పేట సినిమా పరిస్థితి కూడా అదే.

పండగకి వస్తున్న సినిమా, పైగా తెలుగులో రజనికి మంచి మార్కెట్ ఉన్నప్పటికీ ఒక పక్క బాలయ్య, మరో పక్క చెర్రీ, ఇంకో పక్క వెంకీ ఇలా వరుసగా బడా హీరోల సినిమాలు అదే టైం కి రిలీజ్ కి ఉన్న తరుణంలో పాపం రజనీకాంత్ సినిమాకు థియేటర్స్ దొరకలేదు. కట్ చేస్తే పేట తెలుగు వెర్షన్ నిర్మాత అశోక్ కుమార్ థియేటర్ల మాఫియా అంటూ దిల్ రాజు, అల్లు అరవింద్, యువి వంశీలను టార్గెట్ చేసి ఏకి పడేసాడు.

అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటి అంటే, ఏ నిర్మాత అయినా…ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా తాము నిర్మించిన సినిమాలు రిలీజ్ కి ఉన్నప్పుడు, మరో పక్క తాము కొన్న సినిమాలు రిలీజ్ కి ఉన్నప్పుడు థియేటర్స్ ని బ్లాక్ చేసి తమ సినిమాను ఎక్సహిబిట్ చెయ్యడం షరా మామూలే…ఎందుకంటే సినిమా అంటేనే వ్యాపారం కదా..మరి ఈ క్రమంలో వాళ్లకు అవకాశం ఉంది కనుక అలా చేశారు..లేదంటే నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడినంతగా వ్యవహారం ఉండేది కాదు కదా…

అసలు అంతెందుకు నిర్మాత అశోక్ కుమార్ కే థియేటర్స్ అత్యధికంగా ఉంటే ఆయన అవకాశం ఇస్తారా? వ్యాపారం అన్నాక ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకోవడం షరా మామూలే కదా. దీనికి సరైన పరిష్కారం చూపిస్తే తప్పా నిర్మాతలకు ప్రతీ సారి ఈ పాట్లు తప్పేలా లేవు.