No salaries for village volunteersవైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాలంటీర్ల వ్యవస్థ నిర్వహణలో ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఉంది. ఆగస్టు 15న విధుల్లోకి జాయిన్ అయిన వాలంటీర్లకు ఈ నెల 1న 45 రోజులకు జీతాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ నెల 15కు కూడా ఇంకా చాలా చోట్ల వాలంటీర్లకు జీతాలు అందలేదట.

వాలంటీర్లకు నెలకు 5000 రూపాయిల గౌరవ వేతనం అని ప్రభుత్వం ప్రకటించింది. మొన్న ఆ మధ్య ఆ వేతనం 8000 రూపాయలకు పెంచుతామని ప్రభుత్వం లీకులు కూడా ఇచ్చింది. అయితే వేతనం పెంపు మాట ఎలా ఉన్నా అసలు ముందుకు ఇస్తామన్న జీతం కూడా ఇప్పటిదాకా ఇవ్వకపోవడం. సరుకుల రవాణా, జెరాక్స్ లకోసం ఇప్పటికే తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టడంతో నిర్వహణ భారం ఎక్కువై ఇబ్బందులు పడుతున్నారు.

నిన్న ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో వాలంటీర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి, కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. రెండు నెలల జీతం ఇవ్వకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సరుకుల రవాణా, డోర్ డెలివరీకి ప్యాకింగ్ ఖర్చులు ఎక్కువ అవ్వడంతో ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది.

దీనివల్ల రేషన్ లో భాగంగా ఇస్తున్న కొన్ని సరుకులు తగ్గించి ప్రభుత్వంపై భారం తగ్గించుకునే ప్రయత్నాలు చెయ్యడం గమనార్హం. దీనితో లబ్ధిదారులు కూడా సంతోషంగా లేకపోవడంతో ప్రభుత్వం సంశయంలో పడింది.