No Premier shows for kalki in usaకొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో అసలు ప్రేక్షకులు గుర్తు కూడా పెట్టుకోలేని స్టేజ్‌కు వెళ్లిపోయిన హీరో రాజశేఖర్. ఇంక రిటైర్ కావడమా లేదంటే విలన్ పాత్రలు చేసుకోవడమా అనుకుంటున్న తరుణంలో ప్రవీణ్ సత్తార్ తెరకెక్కించిన ‘పీఎస్వీ గరుడ వేగ’ సినిమాతో మరోసారి సత్తా చూపించాడు. ఈ సినిమాతో రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనిపించాడు ఈ సీనియర్ హీరో. హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమాతో హీరోగా రాజశేఖర్ గోడకు కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంలో ఇప్పుడు కల్కి సినిమాతో వస్తున్నాడు రాజశేఖర్. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించాడు. రేపు విడుదల అయ్యే ఈ సినిమాకు అమెరికా ప్రీమియర్లు కాసేపట్లో జరగాల్సి ఉంది. అయితే అవి రద్దు అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇండియా నుండి కంటెంట్ పంపడంలో ఆలస్యం కావడమే దీనికి కారణమని తెలుస్తుంది. అయితే ఎలాగైనా కొన్ని మేజర్ సెంటర్లలోనైనా ప్రీమియర్లు వెయ్యడానికి డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

ఏం జరుగుతుందో చూడాలి. ఇకపోతే స్వదేశీ మార్కెట్లలో కూడా అడ్వాన్స్ బుకింగ్లు ఆశాజనకంగా ఏమీ లేవు. అయితే టాక్ మంచిగా వస్తే పిక్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 1983లో తెలంగాణ‌లో జ‌రిగిన కొన్ని య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. అక్క‌డ జ‌రిగిన కొన్ని హ‌త్య‌ల మిస్ట‌రీల‌ను చేధించ‌డానికి వ‌చ్చే పోలీస్ ఆఫీస‌ర్ క‌థ ఇది. హిట్ అవ్వాలంటే ఈ సినిమా దాదాపుగా 11 కోట్ల మేర షేర్ కలెక్టు చెయ్యాల్సిఉంది. దానికి ఓపెనింగులు కీలకం.