no people for kcr malkajgiri public meetingఇటీవలే తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయదుందుభి మోగించి ఎదురులేని శక్తిగా ఉన్న టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చెయ్యాలని కృతనిశ్చయంతో ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థులు 16 పార్లమెంట్ స్థానాలలో 16, అలాగే మిత్రపక్షమైన ఎంఐఎం ఒకటి గెలుచుకుని మొత్తం 17 సీట్లతో కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పాలని కేసీఆర్ ఆశయంగా ఉంది. అయితే ఏమైందో ఏమో గాని ఉన్నఫళంగా టీఆర్ఎస్ కు అన్నీ అపశకునాలే ఎదురవుతున్నాయి.

మొన్నటికి మొన్న ఉపాధ్యాయుల, పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు ఓడిపోయారు. నిన్న హైదరాబాద్ లో తలపెట్టిన కేసీఆర్ ప్రచారసభ జనం లేని కారణంగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఎల్బీ స్టేడియం లో జరగాల్సిన సభకు కేవలం 3000-400 వేల మందే వచ్చారు. మొదటి వారసులు కూడా నిండలేదు. దీనితో సీఎం సభకు రాకుండా ప్రగతిభవన్ కు వెళ్లిపోయారు. జనసమీకరణలో విఫలమైన సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి నాయకులకు తలంటినట్టు సమాచారం.

మొత్తానికి ఎల్బీ స్టేడియం సమావేశం రద్దు కావడంతో… ఇకపై సీఎం కేసీఆర్ పాల్గొనే సభల జనసమీకరణ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని టీఆర్ఎస్ నేతలకు ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. మూడు నియోజకవర్గాల స్థాయిలో చేపట్టిన సభకు జనం ఆశించిన స్థాయిలో ప్రతిపక్షం ఊపిరి పీల్చుకుంది. ఇదే పాజిటివ్ గా తీసుకుని మరింత కష్టపడాలని వారు అంటున్నారు. అయితే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ తన ఎకౌంటును ఓపెన్ చేస్తుందా అనేది ఇంకా అనుమానమే.